నెల్లూరు నగర పాలక సంస్థకు సంబంధించి కార్మికుల సమస్యలపై మంగళవారం మేయర్ ను తన చాంబర్ లో కలిసి ఎపి వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర పారిశుద్ధ్యం లో కార్మికుల కష్టమే కీలకం అని తెలిపారు. నెల్లూరు నగర పాలక సంస్థ కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని మేయర్ తెలియజేశారు.