సీఎం చంద్రబాబుతోనే గత 30 సంవత్సరాల మాదిగల పోరాట ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ పేర్కొన్నారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ఎస్సీ ఉప వర్గీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలపడం హర్షనీయమన్నారు. త్వరలో విడుదల చేయనున్న డీఎస్సీ నోటిఫికేషన్ తోనే విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ సమానంగా అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు.