నెల్లూరు భగత్ సింగ్ కాలనీలోని జగనన్న కాలనీకి చెందిన మహిళ (26) భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమెతో సన్నిహితంగా ఉండే సాయికిరణ్ గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె మనస్తాపానికి గురైంది. శనివారం ఇంట్లోని ఫ్యానుకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రికి తరలించే లోగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.