వెంకటాచలం మండలం మల్లుగొండ సంఘం వద్ద శుక్రవారం ఉదయం ఆటో-బైకు ఢీకొంది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.