ప్రతిరోజూ లక్ష పనిదినాలు లక్ష్యంగా ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో ఉపాధిహామీ, హౌసింగ్, పంచాయతీ రాజ్ సీసీ రోడ్ల గ్రౌండింగ్, ఎంఎస్‌ఎంఈ సర్వే, పిఎం సూర్యఘర్ యోజన పథకం అమలు మొదలైన అంశాలపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడీవోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.