ఈనెల 20 తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెకు సంఘీభావం తెలుపుతూ తాము కూడా నోటీసు ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ గురువారం తెలియజేసింది. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యన్ కు నోటీసు అందజేశారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తూ ఇప్పటివరకు ఎం టి ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.