జిల్లాలో గుర్తించిన 7184 ప్రదేశాలలో ఈ నెల 14 న యోగా ప్రదర్శనలు (డెమోనిస్ట్రేషన్) నిర్వహించాలని ఇంచార్జి కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందస్తుగా ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు.