నెల్లూరు చంద్రమౌళి నగర్ కు చెందిన లక్ష్మీసాయి తేజ అలియాస్ కమ్మసాయిపై వేదాయపాలెం పోలీసుస్టేషన్లో రౌడీ షీటు ఉంది. 2022 మేలో ఆయనపై పోలీసు అధికారులు పీడీ యాక్ట్ ప్రయోగించి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఏడాది పాటు జైలులో ఉండి వచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పలు హత్యాయత్నాలు, దోపిడీ, దౌర్జన్యం కేసులు ఉన్నాయి. మార్పు రాకపోవడంతో మంగళవారం పీడీ యాక్ట్ నమోదు చేశారు.