చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అక్రమ కేసుల భయం లేకుండా గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం వారు బుచ్చిరెడ్డిపాలెంలో పర్యటించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేసి చూపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.