పొదలకూరు రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి

74చూసినవారు
పొదలకూరు రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి
నెల్లూరు పొదలకూరు రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పొదలకూరు రోడ్డు అభివృద్ధి పై కార్పొరేషన్, ఆర్&బి, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు ఎవరి బాధ్యతలు వారు తీసుకొని యుద్ధప్రాతిపదికన నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తిచేయాలన్నారు.

సంబంధిత పోస్ట్