యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 11వ రాష్ట్ర మహాసభను ఈ నెల 14, 15 తేదీల్లో గుంటూరులో విజయవంతంగా నిర్వహించాలని మంగళవారం జిల్లా ఉపాధ్యక్షులు వి. ప్రసాద్ వెల్లడించారు. గ్రేడ్ టు జూనియర్ లైన్మెన్‌లకు ఒకే సర్వీస్ రూల్, విద్యుత్ శాఖలో మెడికల్ సౌకర్యం, బకాయి 3 డీఏల విడుదల, ఈపీఎఫ్‌ను జిపిఎఫ్‌గా మార్చాలని వారు డిమాండ్ చేశారు.