నెల్లూరు నగరంలోని డి. ఆర్. డి. ఏ. 33/ 11 కేవీ సబ్ స్టేషన్ పరిధి లోని సండే మార్కెట్ ఫీడర్ డ్యామేజ్ కండక్టర్ ను తొలగించి కొత్త కండక్టర్ ఏర్పాటు చేస్తున్న కారణంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ తెలిపారు. స్థానిక పొగతోట, సండే మార్కెట్, నాగులమిట్ట రోడ్డు, బృందావనం పరిసర ప్రాంతాల్లో ఉదయం 8: 00 నుండి మద్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు.