పొదలకూరు మండల బీజేపీ నూతన అధ్యక్షులుగా పూల ప్రశాంత్ ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయం లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం లో ప్రశాంత్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రశాంత్ పేరును సంగన పెంచల రెడ్డి ప్రతి పాదించిగా సుబ్రహ్మణ్యం రెడ్డి బలపరిచారు. బిజెపిని తన వంతుగా బలోపేతం చేస్తానని ప్రశాంత్ పేర్కొన్నారు.