నెల్లూరు జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆదివారం ఉదయం నుంచి ఎండకాసింది. అయితే సాయంత్రానికి అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం ప్రాంతాల్లో మబ్బులు కమ్ముకొని వర్షం కురిసింది. ఉలవపాడులో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో కరెంట్ లో అంతరాయం ఏర్పడింది.