సర్వేపల్లి: ఆధార్ నమోదు కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు

84చూసినవారు
సర్వేపల్లి: ఆధార్ నమోదు కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు
మనుబోలు మండలంలో సచివాలయంలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ సుబ్బయ్య, ఎంపీడీవో జలజాక్షి కోరారు. జట్ల కొండూరులో మంగళవారం ఆధార్ నమోదు కేంద్రాన్ని వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గిరిజనులకు ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్