విద్యార్థులందరూ చదువును ఎక్కడా ఆపకుండా కొనసాగించినపుడే, జీవితంలో ఎలాంటి లక్ష్యం చేరుకోవాలనే ఆలోచనలు కలుగుతాయని జిల్లా కలెక్టర్ ఆనంద్ విద్యార్థులకు ఉద్బోధించారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్ లో 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 5 నుండి 10వ తరగతి వరకు ప్రతిభ కనబరిచిన ఎస్సీ, ఎస్టీ బాలికలకు స్కాలర్‌షిప్ అందించడానికి కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో విద్యా జ్యోతి పథకం ద్వారా చెక్కును పంపిణీ చేశారు