నెల్లూరు నగరంలో డివైడర్లలో పచ్చదనాన్ని పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ అధికారులను ఆదేశించారు. నెల్లూరు రంగనాయకుల పేట పినాకిని పార్కును కమిషనర్ శుక్రవారం పరిశీలించారు. పార్కుకు అనుసంధానంగా ఉన్న పది అడుగుల అప్రోచ్ రోడ్డును విస్తరించి 30 అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి గార్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.