టెన్త్ సప్లీ ఫలితాలు. 13వ స్థానంలో నెల్లూరు జిల్లా

55చూసినవారు
టెన్త్ సప్లీ ఫలితాలు. 13వ స్థానంలో నెల్లూరు జిల్లా
పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. నెల్లూరు జిల్లాలో 4,690 మంది పరీక్ష రాయగా 3,637 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 77.55గా నమోదై రాష్ట్రంలో జిల్లా 13వ స్థానంలో నిలిచింది. బాలురలో 2,721 మంది పరీక్ష రాయగా 2,040 మంది, బాలికల్లో 1,969 మంది రాయగా 1,597 మంది పాస్ అయ్యారు. జూన్ 13–19 మధ్య రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్