డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయం నెరవేరాలని నెల్లూరు రూరల్ లోని శ్రీనరసింహ స్వామి ఆలయంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్ వారి సతీమణి విజయలక్ష్మి 108 దీపాలతో సోమవారం దీపారాధన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల లడ్డు అపవిత్రం చేసిన వారికి చట్టరీత్యా శిక్ష పడాలని, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఆశయం ఫలించి దర్మపరిరక్షణ జరగాలన్నారు.