వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న నెల్లూరు రూరల్ డీఎస్పీని కొందరు దుండగులు కారుతో ఢీ కొట్టి పరారయ్యారు. ప్రమాదంలో గాయపడిన డీఎస్పీ శ్రీనివాసరావు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ముందస్తు సమాచారంతో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు.