నెల్లూరు నవలాకుల తోటలో చోరీ

58చూసినవారు
నెల్లూరు నవలాకుల తోటలో చోరీ
నెల్లూరు రూరల్ పరిధిలోని నవలాకులతోట లో దొంగతనం జరిగిన విషయంపై సోమవారం ఫిర్యాదు అందింది. ద్వారకానగర్ లో ఉమా మహేశ్వరరావు కుటుంబం ఊరికి వెళ్లి తిరిగి రాగా తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లోని బీరువా తెరిచి ఉంది. బీరువాలో ఉండాల్సిన నాలుగు సవర్ల బంగారు నగలు, పావుకిలో వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు గుర్తించారు. బాధితులు నెల్లూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్