ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా త్రివిధ దళాలకు మద్దతుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్యాణమండపం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు తిరంగా ర్యాలీని శనివారం నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, బిజెపి నాయకులు మండ్ల ఈశ్వరయ్య జనసేన నేత సుందరరామిరెడ్డి పాల్గొన్నారు.