నెల్లూరు నగరంలోని, విఆర్సీ సెంటర్ ముత్తుకూరు బస్టాండ్ వద్ద దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ జయంతి వేడుకలు బుధవారం బిజెపి మండల అధ్యక్షుడు చిలకపాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో మరపురాని నేత అటల్ బిహారీ వాజపేయి అని అయన నాయకత్వంతో భారతదేశాన్ని గర్వించే దేశంగా మార్చారన్నారు.