వరికుంటపాడు మండలం సాతువారిపల్లి గ్రామంలో మండల అధ్యక్షులు రసూల్ పఠాన్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గం POC కొట్టె వెంకటేశ్వర్లు సమక్షంలో వైస్సార్సీపీ మద్దతుదారులు దాదాపు 80 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. ముఖ్యంగా స్థానికులు రోడ్లు, నీరు, స్మశానం సమస్యలు గురించి ప్రస్థావించారు. కొట్టె, ఎమ్మెల్యే కాకర్ల సురేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొనిపోయి త్వరగా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.