జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతాయని నెల్లూరు జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 3 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు జరుగుతాయని, కొన్ని నియోజకవర్గాలలో ఇంకా ఎక్కువ పనులకు ప్రారంభోత్సవాలు జరుగుతాయన్నారు. స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు వీటిని చేస్తారన్నారు.