నెల్లూరు నగరంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు హనుమాన్ భక్త శోభయాత్ర ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వాహనాలను మళ్ళిస్తున్నట్లు జిల్లా పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు టౌన్ లోనికి వచ్చే వాహనాలను సాయంత్రం 4. 00 నుండి నల్లపు రెడ్డి శ్రీనివాసరెడ్డి విగ్రహం వద్ద నుండి పొదలకూరు రోడ్డు వైపుకు ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుందని వాహనదారులు అందరు సహకరించాలన్నారు.