వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి సమీపంలోని మల్లుగుంట సంఘం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మల్లి లక్ష్మీదేవి (59) మృతిచెందారు. వ్యవసాయ పనుల కోసం ఆటోలో వెళ్తున్న సమయంలో, ఎదురుగా ద్విచక్రవాహనం రాగా, తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు మహిళలు గాయపడి నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.