వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ఇంటర్-కాలేజియేట్ స్టాఫ్ పురుషులు, మహిళల క్రీడా టోర్నమెంట్ గురువారం ఘనంగా ముగిసింది. వివిధ కాలేజీల అధ్యాపకులు, ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.