రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటినుంచి ఇళ్ల, కట్టడాల నిర్మాణాల్లో నిబంధనలు అతిక్రమిస్తే అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ సూర్యతేజ, సిటీప్లానర్ దేవీకుమారి, హెల్త్ ఆఫీసర్ చైతన్యతో కలిసి శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాలతో మంత్రి సమీక్ష నిర్వహించారు.