వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తాం.. మంత్రి

71చూసినవారు
వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తాం.. మంత్రి
ఏపీలోని మున్సిపల్ కమిషనర్లతో (శనివారం) మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, రీజినల్ డైరెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్లు ఉదయం 6 గంటల నుంచే కచ్చితంగా క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నారాయణ అన్నారు. ఆరోగ్య కారణాలతో క్షేత్ర స్థాయి పర్యటన చేయలేని అధికారులకు డైరెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు. మున్సిపల్ శాఖ అధికారులు క్షేత్ర స్థాయి పర్యటన చేయాల్సిన బాధ్యత ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్