నెల్లూరు భగత్ సింగ్ కాలనీకి చెందిన ఓ యువతి ఇంటి నుంచి అదృశ్యమైంది. బయటకు వెళ్లిన యువతి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సోమవారం నెల్లూరు నవాబ్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో హత్యలతో పాటు మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. యువతి అదృశ్యానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.