మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన వాయిదా పడింది. రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణిని ఈ నెల 12న నెల్లూరులో జగన్ పరామర్శించాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల జగన్ పర్యటన వాయిదా పడినట్లు వైసీపీ కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కాగా, అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.