ఆధునిక సాంకేతికత అండగా గ్రామాలు, పట్టణాల సర్వతోముఖాభివృద్దికి తద్వారా అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పని చేస్తున్నదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.