నెల్లూరు రూరల్ విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అల్లీపురం ఏఈ శ్రీలక్ష్మి తెలిపారు. దీనివల్ల కోడూరుపాడు, నారాయణరెడ్డిపేట, నవలాకులతోట, కొత్తకాలువ ప్రాంతాల్లోని ఇండస్ట్రీయల్ ఏరియా, అల్లీపురం, పెద్దచెరుకూరు, గుడిపల్లిపాడు, చింతారెడ్డిపాళెం, రాజుపాళెం ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.