నెల్లూరు నగరంలోని సరస్వతీ నగర్ సబ్ స్టేషన్ లో సూర్య ఘర్ పథకంపై వినియోగదారులకు గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డైకస్ రోడ్డు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్. లక్ష్మీ బాయి, రాజేంద్ర నగర్ సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిరణ్ తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.