కుటుంబ విలువలు, గురువుల పట్ల అపారమైన గౌరవం వంటివే భారతదేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపాయని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పిల్లలకు చదువుతో పాటు సంస్కృతిని కూడా నేర్పటం ద్వారా వారిని దేశభక్తులైన నవభారత నిర్మాతలుగా తీర్చిదిద్దవచ్చని ఆయన తెలిపారు. నెల్లూరులోని టౌన్ హాల్ లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.