నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఆమంచర్ల గ్రామం మట్టంపాడులో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు ఆలీ సందడి చేశారు. స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలీ దంపతులను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. తనకు సన్నిహితంగా ఉన్న పలువురిని ఆలీ పేరుపేరునా పలకరించారు.