నెల్లూరు జిల్లాకు రానున్న మాజీ సిఎం జగన్

76చూసినవారు
నెల్లూరు జిల్లాకు రానున్న మాజీ సిఎం జగన్
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు రానున్నారు. నెల్లూరు జిల్లా కారాగారంలో ఉన్న మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని, జగన్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే కాకుటూరు సమీపంలో హెలిపాడ్ ను మాజీ మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి మంగళవారం స్థల పరిశీలన చేశారు. ఈనెల 13వ తేదీన జిల్లాకు జగన్ వస్తారని సమాచారం. అయితే అదే రోజు జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన కూడా ఉంది.

సంబంధిత పోస్ట్