మాఘమాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లాల ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి, కామాక్షితాయి అమ్మవారు వెండినంది వాహనంపై గ్రామోత్సవాన్ని శనివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాలెం వాస్తవ్యులు గునుపూడి వెంకటరామయ్య ధర్మపత్ని శైలజ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేశారు.