నెల్లూరు రూరల్ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆయనకు భారీ గజమాలతో స్వాగతం పలికారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వెంట నడవడంతో దేవరపాలెం గ్రామం కిటకిటలాడింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ గిరిధర్ రెడ్డి ముందుకు సాగారు.