నెల్లూరు జిల్లా పెంచలకోన వద్ద రాత్రి చిరుత సంచారం కలకలం రేపింది. పెంచలకోన దేవస్థానం అటవీశాఖ అతిథి గృహం సమీపంలో బుధవారం చిరుత కదలికలు కనిపించాయి. కొందరు వ్యక్తులు కారులో ప్రయాణిస్తుండగా బైపాస్ రోడ్డుపై ఉన్న చిరుతను చూసి భయాందోళనకు గురైయ్యారు. కారు హార్న్ శబ్దంతో చిరుత అడవిలోకి వెళ్ళింది.