నెల్లూరు జిల్లా అనంతపురం గ్రామంలోని వాటర్ బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీకై 10 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఘటన జరగడంతో కార్మికులంతా పరుగులు తీశారు. ఇక అస్వస్థతకు గురైన వారిని వెంటనే నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. నిమిషాల్లోనే అమోనియా చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.