వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు నిరసనగా సోమవారం నెల్లూరు నగరంలో నిర్వహించే ఆందోళన కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ చార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి విడుదల చేశారు. నెల్లూరు రూరల్ లోని చింతా రెడ్డిపాలెం గ్రామంలోని తన నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతల సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సాగింది. మైనార్టీ నేత సిద్ధిక్ పాల్గొన్నారు.