నెల్లూరు గ్రామీణ మండలంలో మూడో తరగతి చదువుతున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మినరల్ వాటర్ సప్లయర్‌గా పని చేస్తున్న శీనయ్య అనే వ్యక్తి, చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అకృత్యానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, శనివారం పోక్సో కింద కేసు నమోదైంది.