నెల్లూరు: రొట్టెల పండుగలో యాచకుల వేధింపులు

4చూసినవారు
నెల్లూరు: రొట్టెల పండుగలో యాచకుల వేధింపులు
నెల్లూరు బారాషాహిద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ సందర్భంగా భక్తులు ఆధ్యాత్మికంగా నిమగ్నమై ఉండగా, యాచక మహిళల ముఠాలు భక్తులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. నెత్తిపై పోలేరమ్మ బొమ్మ, చేతిలో వేపమండలు పెట్టుకొని, నలుగురైదుగురు కలిసి చుట్టుముట్టి భక్తులపై ఒత్తిడి తెచ్చేలా డబ్బుల కోసం వేధిస్తున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్