రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ 68వ పుట్టినరోజును పురస్కరించుకొని నారాయణ యూత్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఆదివారం నెల్లూరు గోమతి నగర్ నందుగల మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ రక్తదాన శిబిరంలో 200 మందికి పైగా యువకులు రక్తదానం చేశారు. నారాయణ యూత్ సభ్యులు కె. లెకిన్ రెడ్డి, కోటారెడ్డి, సుభాష్ హేమంత్, యశ్వంత్ నేతృత్వంలో పెద్ద ఎత్తున యువకులు రక్తదానం చేశారు.