నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధులు కేటాయించిన సిబ్బంది అందరూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శనివారం సాయంత్రం నెల్లూరు బారాషహీద్ దర్గా ప్రాంగణంలో రొట్టెల పండుగ ఏర్పాట్లను కలెక్టర్ ఆనంద్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, కమిషనర్ నందన్ పరిశీలించారు. దర్గా ప్రాంగణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు.