సీపీఎం నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని విద్యుత్ భవనం వద్ద గురువారం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ, విద్యుత్ భారాలు తగ్గించాలని విద్యుత్ సంస్కరణలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, కొండా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.