డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వచ్చిన ప్రాంతాల్లో అధికారులు మరింత శ్రద్ధ వహించాలని జిల్లా మలేరియా అధికారి హుసేనమ్మ తెలియజేశారు. మంగళవారం నెల్లూరు జిల్లాలోని సబ్ యూనిట్ ఆఫీసర్లకు జిల్లా మలేరియా అధికారి ఇ. హుసేనమ్మ ఆధ్వర్యంలో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. అదేవిధంగా కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దృష్టి సారించాలన్నారు.