నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మే 15న 339 అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండడంతో నెల్లూరు జిల్లా ఎస్. పి. జి. కృష్ణకాంత్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఈ మేరకు ఆయనతో భేటీ అయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయనకు వివరించారు.